
జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా చిలువూరి కిరణ్మయి బుధవారం విధుల్లో చేరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ప్రస్తుతం మంగళగిరి టీబీ శానిటోరియం హాస్పిటల్‌లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతి పొంది గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరారు. గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్మయి సికింద్రాబాద్ గాంధీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు 2000లో పూర్తి చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సుగా 2001 జనవరిలో చేరి ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. హెడ్‌నర్సుగా 2007లో ఉద్యోగోన్నతి పొంది నిజామాబాద్ పీచ్‌పల్లికి బదిలీ అయ్యారు. అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక బదిలీ అయి 2008లో గోరంట్లలోని జ్వరాల ఆస్పత్రిలో చేరారు. 2018 వరకు అక్కడే పనిచేసి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం మంగళగిరి బదిలీ అయ్యారు. ఇప్పుడు గ్రేడ్ –1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరిన కిరణ్మయికి పలువురు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ యూనియన్ అధికారులు, వైద్య సిబ్బంది, వైద్యులు అభినందనలు తెలిపారు.