
కవాడిగూడ: నగరంలోని ప్రసిద్ధిగాంచిన ఇందిరాపార్కును రాజకీయాలకు అతీతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇందిరాపార్కు వాకర్స్‌కు హామీ ఇచ్చారు. బుధవారం ఉగాది పండుగను పురస్కరించుకోని ఇందిరాపార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ శోభకృత్ నామ సంవత్సరంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఇందిరాపార్కును రాష్ట్రంలోనే ఆదర్శపార్కుగా తీర్చిదిద్దేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ పండగలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరాపార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ.సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎస్.నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు టి.కె.ఎం.రెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రభాకర్‌రయదవ్, కోశాధికారి గాజుల శంకర్, అసోసియేషన్ నాయకులు నరేందర్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హామీ
Comments
Please login to add a commentAdd a comment