
సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా జోయల్ డెవిస్
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం చీఫ్‌గా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డి.జోయల్ డెవిస్ నియమితులయ్యారు. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి నలుగురు అధికారులు ఉన్నారు. జోయల్ డెవిస్ గతంలో హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా, సిద్దిపేట కమిషనర్‌గా పని చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సైబరాబాద్‌లో ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌గా (జేసీపీ) వ్యవహరిస్తున్నారు. ఆ పరిధిలో ఉన్న అనేక రహదారుల్ని అధ్యయనం చేసిన ఆయన క్లిష్టమైన ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడంతో తన మార్కు చూపించారు. ఈ నేపథ్యంలో ఆయనను అత్యంత కీలకమైన సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. కొన్నాళ్లుగా రాజధానిలోని ట్రాఫిక్ సమస్యలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో జోయల్ డెవిస్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అదనపు సీపీ హోదాలో సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా పని చేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పి.విశ్వప్రసాద్‌ను ప్రభుత్వం నగర నేర విభాగానికి బదిలీ చేసింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్‌తో అదనపు సీపీగా (నేరాలు) పని చేస్తున్న ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీనే ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. జోయల్ డెవిస్ బదిలీతో ఖాళీ అయిన సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జేసీపీ పోస్టులో 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ గజరావ్ భూపాల్ నియమితులయ్యారు. గతంలో దక్షిణ మండల డీసీపీ, సీసీఎస్ డీసీపీగా పని చేసిన ఆయన 2023 నుంచి డీజీపీ కార్యాలయంలో కో–ఆర్డినేషన్ విభాగం డీఐజీగా పని చేస్తున్నారు. జోయల్ డెవిస్ బదిలీతో ఆయన్ను మరో కీలకమైన సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. గతంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీగా పని చేసిన ఎస్.చైతన్యకుమార్‌కు 2020 బ్యాచ్ ఐపీఎస్ ఖరారైంది. ఈయన కొన్నాళ్లుగా నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆయన స్థానంలో సైబరాబాద్‌కు గజరావ్ భూపాల్
అదనపు కమిషనర్‌గా (నేరాలు) వెళ్లిన పి.విశ్వప్రసాద్
చైతన్యకుమార్‌ను ఎస్బీ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment