8 మందితో కూడిన కమిటీ నియామకం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నూతన పరిపాలన భవనం పోర్టికో కుప్పకూలిన ఘటనపై విచారణకు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఒక నోటిఫికేషన్‌ను హెచ్‌సీయూ రిజిష్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ విడుదల చేశారు. 8 మందితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో చైర్మన్‌గా స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ వై. సురేష్, సభ్యులుగా ప్రొఫెసర్ మల్లయ్య, ఎస్.సూర్యప్రకాశ్, బాషా, శివాజీ, రామ్‌శేషు, పి.శ్రీనివాసరావు, జీవీ రెడ్డి నియమితులయ్యారు. పోర్టికో కూలిన అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా అందించాలని వైస్ చాన్స్‌లర్ ఆదేశించారు. గత నెల 27న పోర్టికో కుప్పకూలిన ప్రమాదంలో 11 మంది కార్మికులకు గాయాలైన విషయం విదితమే.