న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమైనా, ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనాను జుయించే యాంటీబాడీస్‌పై డాక్టర్లు దృష్టి పెట్టారు. యాంటీబాడీస్ మానవ శరీరంలో ఏ విధంగా వస్తుందో విశ్లేషిద్దాం. మానవ శరీరంలో ప్రవేశించే వైరస్(కరోనా), బ్యాక్టేరియాలను ఢీకొట్టి శరీరానికి రక్షణ వ్యవస్థ లాగా యాంటీబాడీస్(వ్యాధి కారకాన్ని ఎదుర్కొనే రక్షక దళాలు,) పనిచేస్తాయి. రెండు రకాల ఇమ్యునోగ్లోబులిన్ యాంటీబాడీస్(ఐజీఎమ్), (ఐజీజీ)లు మానవులకు రక్షణ కల్పిస్తాయి. రెండు రకాల యాంటీబాడీస్ గురించి తెలుసుకుందాం.
ఐజీఎమ్ యాంటీబాడీస్: మానవులలో వైరస్ ప్రవేశించిన మొదటి వారంలో ఐజీఎమ్ యాంటీబాడీస్ రక్షణ కలిగిస్తాయి. కానీ ఆరు వారాల తరువాత శరీరం నుంచి నిష్క్రమిస్తాయి. కాగా ఐజీఎమ్ యాంటీబాడీస్ మానవుల్లో ప్రవేశించాక వైరస్ లేదా బ్యాక్టేరియా ప్రవేశించినట్లు తెలిపే మొదటి సూచన అని అపోలో శ్వాస వ్యాధి నిపుణులు రవీంద్ర మెహతా తెలిపారు
ఐజీజీ యాంటీబాడీస్: మానవుల్లో వ్యాధి కారకం(వైరస్, బ్యాక్టేరియా) ప్రవేశించాక మూడు వారాల తరువాత ఐజీజీ శరీరానికి సూచిస్తుంది. లేట్‌గా వచ్చిన లేటేస్ట్ అన్నట్లుగా ఐజీజీ యాంటీబాడీస్ చాలా కాలం పాటు మానవుల రోగనిరోధకశక్తిని కాపాడుతుంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాంటీబాడీస్ పరీక్షలవైపు డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. కాగా యాంటీబాడీస్ పరీక్ష, రక్తపరీక్ష మాదిరిగా సులభంగా చేయొచ్చు. కేవలం యాంటీబాడీస్ పరీక్ష రూ.500లతో చేసి, అరగంటలో ఫలితం ఇస్తారు.
చదవండి: ప్రాణం తీసిన భయం
Comments
Please login to add a commentAdd a comment