![Biden assures Americans in Afghanistan We will get you home - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/21/bid.jpg.webp?itok=WSI-3H_Y)
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకున్నారు. ఇప్పటికీ అక్కడ వందలాది మంది అమెరికన్లు ఉండిపోయారు. వారందరినీ స్వదేశానికి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ‘మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం’ అంటూ తమ దేశస్థులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. ఆయన శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అఫ్గాన్‌లో అమెరికన్లు ఉన్నపళంగా వెనక్కి తీసుకురాలేక అమెరికా తంటాలు పడుతోంది. కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వద్ద హృదయ విదారక దృశ్యాలకు కేవలం బైడెన్ కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment