సియోల్: ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఆహారపు అలవాట్లకు చైనా పెట్టింది పేరు. బొద్దింకలు మొదలుకుని గబ్బిలాల వరకు క్రిమి కీటకాలు, జంతువులు, పాములను కూడా వారు తింటారు. అయితే ఈ సంప్రదాయం గతంలోనే దక్షిణ కొరియాకు సోకినా.. జంతు ప్రేమికులు సుదీర్ఘకాలంగా పోరాటం చేయడం వలన కొంత వరకు తగ్గిపోయింది. అయితే కొన్ని రోజులు మాత్రం మినహాయింపు ఉందనుకోంది. సాధారణంగా మనం కుక్కలను ప్రేమతో పెంచుకుంటాం. కానీ కొరియాలో ప్రేమగా చంపి వండుకొని తినేస్తారు. అలా అని ప్రతీ రోజు కూడా తినరు. వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి.
ఆ దేశంలో అనాదిగా ఆచరించే ల్యూనార్ క్యాలెండర్ ప్రకారం.. బొక్నాల్ లేదా బాక్ నల్ పేరుతో ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. జూలై 19, 29, ఆగస్టు 8వ తేదీలలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. అందులో కుక్క మాంసంతో చేసిన వంటకమే ప్రత్యేకం. ఇక ఆ వేడుకల్లో డాగ్ సూప్ మహా ఇష్టంగా తాగడానికి ఇష్టపడతారు కొరియన్లు. ఆ సమయంలో డాగ్ సూప్ తాగడం వల్ల, కుక్క మాంసం తినడం వల్ల శరీరానికి మంచి శక్తి, చల్లదనం లభిస్తుందని వారు భావిస్తారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుక్కలను చంపకుండా మరిగేనీటిలో వేసి సూప్‌ను తయారు చేసుకోవడానికే వీరు ఎక్కువగా ఇష్టపడటమే.
Comments
Please login to add a commentAdd a comment