టొరంటో: నేరుగా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది. సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి భారత్ నుంచి నేరుగా విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రయాణానికి 18 గంటలకు ముందుగా ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్ నుంచి చేయించుకున్న కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపింది. ఈ నిర్ణయంపై కెనడాలోని భారత్ హై కమిషనర్ అజయ్ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. 27వ తేదీ నుంచి ఢిల్లీ–టొరంటో/వాంకోవర్‌ల మధ్య రోజువారీ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించారు. వేరే దేశం మీదుగా కెనడాకు వెళ్లే భారత ప్రయాణికులు కూడా మూడో దేశంలో పొందిన కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను ముందుగా చూపించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment