అమెరికాలో నివసిస్తున్న చైనీస్ బ్లాగర్, జర్నలిస్ట్ జెన్నిఫర్ జెంగ్ తన సంచలన వాదన వినిపించారు. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీసీ) హస్తం ఉందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వెనుక చైనా లక్ష్యం.. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య వైషమ్యాలను సృష్టించడమేనని ఆ బ్లాగర్ పేర్కొన్నాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హర్‌దీప్ నిజ్జర్‌ను సీసీసీ ఏజెంట్లు హత్య చేశారని జెంగ్ ఆరోపించారు. 2023, జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్‌ను తపాకీతో కాల్చిచంపారు. కాగా జీ-20 సమ్మిట్ నుండి కెనడాకు తిరిగి వచ్చిన తరువాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పలు దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి.
ఈ బ్లాగర్ తన వీడియోలో నిజ్జర్ హత్యకు ముందు సీసీసీ తన ఉన్నత అధికారులలో ఒకరిని అమెరికాలోని సీటెల్‌కు పంపిందని పేర్కొన్నారు. అక్కడ రహస్య సమావేశం జరిగిందన్నారు. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. కెనడాలో సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సీసీసీ ఏజెంట్లదే బాధ్యత అని బ్లాగర్ జెంగ్ పేర్కొన్నారు.
జూన్ 18న సీసీసీ ఏజెంట్లు తుపాకీలతో నిజ్జర్‌ను వెంబడించారని బ్లాగర్ పేర్కొన్నారు. వారు అతనిని కాల్చి చంపిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి నిజ్జర్ కారు డాష్‌బోర్డ్‌లో అమర్చిన కెమెరాను పగలగొట్టారని అన్నారు. హంతకులు ఉద్దేశపూర్వకంగానే భారతీయ యాసతో ఇంగ్లీషులో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు. సీసీసీ రహస్య ఏజెంట్లు భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రణాళికలో భాగంగానే ఈ పని చేశారని బ్లాగర్ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వీడియోలో పోస్ట్ చేయగా, జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి!
Exclusive: #CCP Kills #Sikh Leader #Nijjar in #Canada To Frame #India, as Part of “#IgnitionPlan" to Disrupt Worldhttps://t.co/cZOalFxZfE#HardeepSinghNijjar, #assassination, #IndiaCanadaRelations, #ChinaIndiaRelations #IsraelPalestineWar pic.twitter.com/RD240btPbU
— Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) October 8, 2023
Comments
Please login to add a commentAdd a comment