వాషింగ్టన్:అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(JoeBiden)పై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(DonaldTrump) విమర్శలు గుప్పించారు. మరణశిక్ష పడిన దాదాపు ప్రతి ఒక్కరికి బైడెన్ శిక్షతగ్గిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. బైడెన్ తాజాగా 37 మంది ఖైదీలకు మరణశిక్షనుంచి విముక్తి ప్రసాదించి జీవిత ఖైదుగా మార్చారు.
శిక్ష తగ్గింపు పొందిన ఖైదీల్లో హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారుండడంపై ట్రంప్ మండిపడ్డారు.‘జో బైడెన్ 37 మంది హంతకుల మరణశిక్షను తగ్గించారు.ఆ హంతకులు చేసినవి తెలుసుకుంటే జో బైడెన్ చేసింది అసలు నమ్మలేం.బాధితుల కుటుంబ సభ్యుల బాధ చెప్పలేనిది’అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో పోస్టు చేశారు.
కాగా జో బైడెన్ మరణశిక్షపై తాను విధించిన మారటోరియాన్ని ట్రంప్ వచ్చాక ఎత్తేస్తారేమోనన్న ఆలోచనతోనే ఖైదీలకు మరణశిక్ష తగ్గించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిక్షతగ్గింపుపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రాబోయే రోజుల్లో మరణశిక్షపై ఎలాంటి సడలింపులు ఉండవనేది స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment