కంబళ పోటీలో బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక కాళ్ల కింద బురద ఉంటే.. పైన ఉన్న ఉట్టిని ఎగిరి కొట్టాలి. ఇవి ఓ రకమైన ఆటలు. అయితే కొన్ని ఆటలు భలే సరదాగా ఉంటాయి. అంతే వింతగా కూడా అనిపిస్తాయి. ఓ భారీ పొడవాటి గుండ్రని చెక్కపై ఓ జిడ్డు ద్రావణం పోసి ఆట ఆడితే ఎలా ఉంటుంది? అది గిన్నిస్ రికార్డ్ కోసమైతే.. ఆ కిక్కే వేరు కదా! తాజాగా ఓ 80 మంది పోటీదారులు పాల్గొన్న ఈ ఆట రికార్డు సృష్టించింది. దీని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘‘80 మంది పోటీదారులు రికార్డు బద్ధలు కొట్టడానికి వెళ్లారు. కానీ అతివేగంగా ఆ జిడ్డు ద్రావణం దాటినది ఎవరు?" అంటూ ఫేస్‌బుక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(జీడబ్ల్యూఆర్) షేర్ చేసిన ఈ వీడియోను 65 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. పోటీదారులు కసితో ఆ లక్ష్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఓ ఇద్దరు పోటీదారులు మాత్రం చివరగా ఉండే జెండాను పట్టుకుంటారు. కాగా దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను. పోటీలో పాల్గొని ఉత్తమంగా, కఠినంగా ప్రయత్నించిన వారికి అభినందనలు.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక "ఈ వీడియోను స్లో మోషన్‌లో చూస్తే మరింత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది" అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు.
చదవండి: శ్మశానాలను తవ్వేసి.. భారీ భవంతులు
వైరల్: ఓ జిడ్డు ద్రావణం.. మరి రికార్డు బద్దలు కొట్టిన వీరుడెవరు?
Published Fri, Jun 11 2021 12:10 PM | Last Updated on Fri, Jun 11 2021 2:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment