NASA Reveals Sound Clip From A Black Hole, Video Viral - Sakshi
Sakshi News home page

కృష్ణ బిలం వినిపించింది! వైరల్‌గా మారిన వీడియో.. సముద్ర అలల ధ్వనిలా

Published Mon, Nov 28 2022 5:49 AM | Last Updated on Mon, Nov 28 2022 9:49 AM

NASA reveal the eerie sound a black hole makes - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షంలో ఉండే కృష్ణ బిలాలు(బ్లాక్‌ హోల్స్‌) గురించి మనకు తెలుసు. వాటిలోనుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాలు అన్న సంగతి తెలియదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు ఈ విషయంలో కొంత పురోగతి సాధించారు. బ్లాక్‌ హోల్‌ నుంచి చిన్నపాటి ప్రతిధ్వనులను రికార్డు చేసి, స్పష్టమైన శబ్దంగా మార్చారు. ఇందుకోసం సొనిఫికేషన్‌ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెబుతున్నారు.

సంబంధిత శబ్దంతో కూడిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇది భూమికి 7,800 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న వీ404 సైగ్నీ అనే బ్లాక్‌హోల్‌కు సంబంధించినదని వెల్లడించారు. నాసా విడుదల చేసిన వీడియోకు సోషల్‌ మీడియాలో భారీ స్పందన లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే 40 లక్షల మందికిపైగా జనం వీడియోను తిలకించారు. కృష్ణ బిలం శబ్దం కొత్తగా ఉందంటూ నెటిజన్లు పోస్టు చేశారు. ఇసుకపై నుంచి దూసుకొచ్చే సముద్ర అలల ధ్వనిలా ఉందని కొందరు పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement