
ముగ్గురు భార్యలతో అద్నాన్
పాకిస్తాన్: ‘మా ఆయన వయసు 22 సంవత్సరాలు... నాలుగో భార్యగా.. మాకు సోదరిగా మంచి యువతి కావాలి.. ఆమె పేరు ఎస్‌తో ప్రారంభం కావాలి.. వివాహానికి ముందు ఒకసారి ఆమె మా భర్తను కలిసి మాట్లాడాలి’ అంటూ ఇచ్చిన ఓ ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. ముగ్గురిని చేసుకున్నావ్.. మరో పెళ్లికి సిద్దపడ్డావ్ నిజంగా నువ్వు దేవుడివి సామి’ అంటున్నారు ఈ ప్రకట చూసిన వారు. పాకిస్తాన్ సియాల్‌కోట్‌కు చెందిన అద్నాన్ అనే వ్యక్తి కోసం ఈ ప్రకటన ఇచ్చారు. ఇక అద్నాన్‌కు 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మొదటిసారి వివాహం అయ్యింది. ఆ సమయంలో, అతను ఒక విద్యార్థి. 20 ఏళ్ళ వయసులో రెండవసారి వివాహం చేసుకున్నాడు. పోయిన ఏడాది మూడవ వివాహం అయ్యింది.
22 ఏళ్ల అద్నాన్ ప్రస్తుతం మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు. కొన్ని కండీషన్‌లు కూడా పెడుతున్నాడు. ఇక నాల్గవ భార్యగా రాబోయే యువతి మొదట అతడిని కలవాలని.. ఆమె పేరు ఎస్‌తో ప్రారంభం కావాలని తెలిపాడు. ఎందుకంటే అతని ముగ్గురు భార్యలు, షుంబాల్, షుబానా, షాహిదా పేర్లతో సరిపోలడానికి ఆమె పేరు 'ఎస్'తో ప్రారంభం కావాలని ఈ షరతు పెట్టాడు. ఇక ఇప్పటికే అద్నాన్‌కి మొదటి ముగ్గురు భార్యల వల్ల ఐదుగురు సంతానం కలగగా ఒకరిని దత్తత తీసుకున్నాడు. మొదటి భార్య షుంబల్‌కి ముగ్గురు పిల్లలు, షుబానాకి ఇద్దరు పిల్లలు జన్మించారు. మూడవ భార్య షాహిదా ఒకరిని దత్తత తీసుకుంది. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!)
‘ఇందరి పోషణ ఎలా.. ఎంత పెద్ద ఇంటిలో నివాసం ఉంటారని’ అద్నాన్‌ని ప్రశ్నించినప్పుడు తాను ఆరు బెడ్ రూములు, డ్రాయింగ్ రూమ్, స్టోర్ రూమ్ ఉన్న ఇంట్లో ఉంటానని వెల్లడించాడు. ఇక మొదటి వివాహం తరువాత తనకి ఆర్థికంగా బాగా కలిసి వచ్చిందని.. ఖర్చులను నిర్వహించడంలో ఎటువంటి సమస్య లేదన్నాడు. కుటుంబానికి నెలకు ఖర్చు లక్ష నుంచి ఒకటిన్నర లక్షల పాకిస్తాన్ రూపాయల మధ్య ఉంటుందని తెలిపాడు. తన ముగ్గురు భార్యలు ఒకరితో ఒకరు బాగా సర్దుకుంటారని వెల్లడించాడు. అతని మీద వారికి ఉన్న ఏకైక ఫిర్యాదు ఏమిటంటే, అతను తమతో తగిన సమయం గడపడం లేదని భావిస్తారు. తన భార్యలు ముగ్గురూ తనను ప్రేమిస్తున్నారని, తాను కూడా వారిని చాలా ప్రేమిస్తున్నానని తెలిపాడు. (బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు)
Comments
Please login to add a commentAdd a comment