కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏడాది కంటే ఎక్కువ కాలం బతకడని ఆ దేశ ఫెడరల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ ఇలియా పొనోమరేవ్ జోస్యం చెప్పారు. అక్టోబర్ 7న జరిగే తన పుట్టినరోజు వరకు కూడా పుతిన్ ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బ్రిటన్ వార్తా సంస్థ ఎక్స్‌ప్రెస్‌తో పొనోమరేవ్ మాట్లాడారు. 2014లో రష్యాతో విలీనమైన క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత పుతిన్ పతనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
క్రిమియా విలీనానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక డిప్యూటీ పొనోమరేవే కావడం గమనార్హం. పుతిన్ ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని కూడా ఈయన బహిరంగంగా ఆరోపించారు. విధులు సరిగ్గా నిర్వర్తించలేదనే కారణంతో అభిశంసనకు గురై దేశం నుంచి వెలివేయబడ్డాడు. దీంతో 2016 నుంచి ఉక్రెయిన్‌లో నివసిస్తున్నారు.
ఏదో ఒక రోజు క్రిమియాలోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశిస్తాయని పొనోమరేవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అదే పుతిన్ పాలనకు ముగింపు అవుతుందన్నారు. అలాంటి సైనిక ఓటమిని పుతిన్ తట్టుకోలేడని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఓడిపోతున్నట్లు పుతిన్‌కు తెలుసునని, కానీ తన బలగాలు విజయం సాధిస్తాయని నమ్ముతున్నారని చెప్పారు.
చదవండి: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక..
Comments
Please login to add a commentAdd a comment