వాషింగ్టన్: ఏదో అనుకుంటూ.. ఇంకేదో అయ్యిందే అని బాధపడుతున్నారంట చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్. భారత భూభాగంలోకి చొరబడాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఏమైంది.. మనం సైన్యం ప్రతి దాడి చేయడంతో తోక ముడవాల్సిన పరిస్థితి తలెత్తెంది. చైనా సైన్యం దారుణంగా విఫలమయ్యింది. ఈ పరిణామాలు జిన్ పింగ్‌ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదంట. దాంతో చాలా క్రూరమైన ప్రక్షాళన చర్యలకు దిగబోతున్నాడంటూ అమెరికన్ మీడియా కోడై కూస్తూంది. ఈ మేరకు వరుస కథనాలను వెల్లడిస్తోంది. వాటి ప్రకారం తాజాగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు జిన్ పింగ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించాడట. అతని సైన్యం మీద అపారమైన నమ్మకం ఉంచి.. దూకుడుగా ప్రవర్తించాడట. అయితే భారత్ కూడా అందుకు ధీటుగా బదులివ్వడం.. రక్షణపరంగా వ్యూహత్మకమైన శిఖరాలను ఆదీనంలోకి తీసుకోవడంతో జిన్ పింగ్ షాక్‌కు గురయ్యాడట. ఈ ఊహించని అపజయం అతడిని తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు అమెరికన్ మీడియా న్యూస్‌వీక్ కథనం వెలువరించింది.
దాంతో జిన్‌పింగ్ దీన్ని ఒక సాకుగా చూపించి తన రక్షణ దళ సలహాదారులను బలవంతంగా తొలగించమే కాక కొత్త వారిని నియమిస్తాడని న్యూస్‌వీక్ వెలువరించింది. ఈ ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య ఘర్షణలు జరిగిన నాటి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఆక్రమించుకున్న అత్యున్న పర్వత భూభాగాలను భారత దళాలు స్వాధీనం చేసుకోవడంతో చైనా దళాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాట. గడిచిన అరశతాబ్ధంలో భారత్ ఎప్పుడు ఇంత దుకుడుగా లేదని.. ఈ చర్యలతో చైనా దళాలు వెనక్కి తగ్గాయని న్యూస్ లింక్ తెలిపింది. అంతేకాక భారత బలగాలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పేలవంగా ఉన్నట్లు తెలిపింది. చైనా గ్రౌండ్ ఫోర్స్‌లు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావవంతంగా పని చేయలేకపోయిందని వివరించింది. ఇది కేవలం 1979లో వియాత్నంకు పాఠం నేర్పించే అంశంలో మాత్రమే విజయం సాధించిందని వెల్లడించినంది. (చదవండి: 'జిన్‌పింగ్ ఓకే అంటేనే లెక్కను వివరిస్తాం')
అంతేకాక ప్రస్తుతం భారత దళాలలు ఆక్రమణదారులకు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని.. ప్రస్తుతం చాలా దూకుడుగా.. రక్షణాత్మకంగా ఉన్నారని.. మొత్తానికి భారత్ తన ఆటని పూర్తిగా మార్చవేసిందని కథనం ప్రచురించింది. అయితే ఈ ఎదురుదెబ్బలను పరిగణలోకి తీసుకుని జిన్ పింగ్‌ని తక్కువ అంచనా వేయలేమని కూడా హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో జి జిన్‌పింగ్ సైనిక అంశాలను పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment