Powerball Lottery Winner USA: Here Is Full Details In Telugu - Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో కనకవర్షం.. రూ.5,215 కోట్ల లాటరీ

Published Wed, Oct 6 2021 6:42 AM | Last Updated on Wed, Oct 6 2021 8:54 AM

Rs 5,215 Crore Lottery For California Resident - Sakshi

డెస్‌ మెయినెస్‌(అయోవా): కాలిఫోర్నియా వాసి ఇంట్లో కనకవర్షం కురిసింది. అమెరికాలో లక్షలాది లాటరీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేల కోట్ల విలువైన ‘పవర్‌బాల్‌ లాటరీ’ ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు 70 కోట్ల డాలర్ల జాక్‌పాట్‌ కోసం సోమవారం రాత్రి తీసిన డ్రాలో మొత్తం ఆరు సంఖ్యలు సరిగ్గా మ్యాచ్‌ అయిన ఒకే ఒక్క లాటరీ టికెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది. కాలిఫోర్నియాలోని మొర్రో బే ప్రాంతంలోని ఒక సరకు దుకాణంలో ఏవరో ఒక వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది. అయితే ఆ అదృష్టజాతకుడు/జాతకురాలు ఎవరనే పేరు, ఇతర వివరాలు మాత్రం ఇంకా బహిర్గతం కాలేదు.

టికెట్‌ కొన్నది నేనేనంటూ ఇంత వరకూ ఎవరూ క్లెయిమ్‌ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఆ విజేత లాటరీ నగదును మొత్తంగా ఒకేసారి తీసుకోవాలంటే 49.6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.3,696 కోట్లు) మాత్రమే లాటరీ సంస్థ అందజేస్తుంది. అలాకాకుండా, విడతల వారీగా తీసుకునేందుకు లాటరీ విజేత ఒప్పుకుంటే ఆ విన్నర్‌కు ఏడాదికి ఒకసారి పెద్దమొత్తం ముట్టజెపుతారు. ఇలా 29 సంవత్సరాల పాటు ఇస్తారు. ఈ రెండు ఆప్షన్లలో ఏ ఒక్కదానికి ఒప్పుకున్నా సరే పన్నులు పోను మిగతా సొమ్ము ఆ వ్యక్తికి దక్కుతుంది. మరోవైపు దాదాపు 28 లక్షల మంది చిన్న స్థాయిలో నగదు బహుమతులు పొందారు. వీరిలో 4 డాలర్లు(దాదాపు రూ.300) మొదలుకొని 10 లక్షల డాలర్ల(దాదాపు రూ.7.45కోట్లు) వరకు సొమ్మును పొందనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement