
కైరో: సూడాన్ ప్రధానమంత్రిగా అబ్దల్లా హమ్‌దోక్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సూడాన్ సైన్యం, రాజకీయ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అక్టోబర్ 25 నుంచి అరెస్టు చేసిన ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను విడుదల చేసేందుకు సైన్యం అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కుదరడం వెనుక ఐక్యరాజ్యసమితి, అమెరికా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గత నెలలో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా హమ్‌దోక్ పదవి నుంచి దిగిపోయారు. అయితే, సైన్యంతో కుదిరిన ఒప్పందంపై తాము సంతకం చేయలేదని సూడాన్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన ‘ఉమ్మా పార్టీ’ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment