1. ‘చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరు’
చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోందని, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్యాకేజ్‌లను కూడా పెంచామన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఇదేం ఆనందం కిమ్.. కొరియన్లు చస్తుంటే ఇలా చేశావేంటి..?
కోవిడ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్న సమయంలో కిమ్.. క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. నార్త్ కొరియా ఆదివారం ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అమెరికాను హెచ్చరిస్తూ కిమ్ మరోసారి క్షిపణి పరీక్షలు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. డైనమిక్ సీఎం యోగి జీ.. హ్యాపీ బర్త్ డే: మోదీ స్పెషల్ విషెస్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పుట్టినరోజు నేడు (ఆదివారం). ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి, డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ జన్మదిన శుభాకాంక్షలు.. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది’ అని పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ప్రమాదానికి కారణం అమోనియం కాదా...?
బ్రాండిక్స్‌లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. 'జన గణ మన' మూవీ రివ్యూ
విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్, డైరెక్టర్‌గా లూసీఫర్ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. చై కోసం స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన సమంత!
ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప తర్వాత హీరోయిన్ సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలతోనూ సామ్ పేరు నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ హీరోయిన్ గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. 'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు'
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. లక్షల కార్లలో లోపాలు, మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్!
ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్‌కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు.. అందరూ పొలిటికల్ లీడర్ల కొడుకులే
జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ‍్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ఆన్‌లైన్ మోసం.. ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు వచ్చింది!
ఒక్కోసారి మాత్రం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకోటి ప్రత్యక్షమై, కస్టమర్లను కంగారుపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫోన్ బుక్ చేస్తే బట్టల సబ్బు దర్శమిచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో వెలుగు చూసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment