అమెరికాలో పట్టాలు తప్పిన అమ్రాటక్‌ రైలు | Three killed, several injured As Amtrak train In US | Sakshi
Sakshi News home page

Train Derails In US: పట్టాలు తప్పిన యూఎస్‌ అమ్రాటక్‌ రైలు

Published Sun, Sep 26 2021 11:29 AM | Last Updated on Sun, Sep 26 2021 12:36 PM

Three killed, several injured As Amtrak train In US  - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మోంటానా రాష్ట్రంలోని అమ్రాటాక్‌ రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి చెందారని, పలువురికి గాయాలైనట్లు ఆదివారం యూఎస్‌ స్థానిక పోలీసులు పేర్కొన్నారు.  ఉత్తర మధ్య మోంటానాలోని  సీయాటెల్‌ -చికాగోల మధ్య వెళ్ళుతున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాద సంభవించిందని చెప్పారు. ఆ రైలులో దాదాపు 146 మంది ప్రయాణకులు, 16 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన కెనడియన్‌ సరిహద్దుకు 48 కి.మీ దరూరంలో జోప్లిన్‌ సమీపంలో సాయంత్రం 4 గంటలకు చోటుచేసుకుందని అన్నారు.

(చదవండి: తాబేలును చుట్టేస్తూ.. మొప్పలతో భయపెడుతూ..)

ఈ అమ్రాటక్‌ రైలుకి రెండు లోకోమోటివ్‌(రెండు ఇంజన్లు) ఉన్నాయని, 10 బోగిలు ఉన్నట్లు పేర్కొన్నారు. మేగాన్‌ వాండర్‌వేస్ట్‌ అనే ప్రయాణికురాలు పట్టాలు తప్పడంతోనే మెలుకువ వచ్చిందని, రైలు పట్టాలు తప్పడం వినడమే గానీ ఇప్పుడే అనుభవమైందని యూఎస్‌ స్థానిక మీడియాకి తెలిపింది.

(చదవండి: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement