కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అంటూ ఇలా ప్రతి దాన్ని విపరీతంగా వినియోగిస్తున్నారు. కొత్తగా ఏది కనిపించినా క్షణాల్లో షేర్ చూస్తున్నారు. వీటిలో మెదడుకు మేత పెట్టేవి కూడా అనేకమున్నాయి. ఇలాంటి ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జాపాన్‌కు చెందిన ఓ శిల్పి చెక్కతో వివిధ రకాల కుక్కలు, కుందేలు, పిల్లులను తయారు చేశాడు. వీటిని ఒక వరుస క్రమంలో అమర్చి వాటి మధ్యలో తన పెంపుడు శునకాన్ని ఉంచాడు. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!)
అది కూడా బొమ్మల మాదిరే చప్పుడు చేయకుండా ఉంది. దీన్ని వీడియో తీసీ ట్విటర్‌లో పంచుకున్నాడు. ముందుగా ఫోటోను ట్వీట్ చేసి ఇందులో నిజమైన శునకం ఏదో చెప్పాలని నెటిజన్లకు సవాల్ విసిరాడు. దీనిని ఇప్పటి వరకు 6 మిలియన్లకు పైగా వీక్షించగా అనేక మంది శిల్పి నైపుణ్యాలను మెచ్చుకుంటున్నారు. ‘ఆ చెక్క శిల్పాలు చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. నా ముందు ఉన్న అసలు కుక్కను కూడా నేను గమనించలేదు. ఖచ్చితంగా ఇది అద్భుతమైన పని.’ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెబుతున్నారు. కొంత మంది సరిగ్గా గుర్తించగా, మరికొంత మంది కనుక్కోవడంలో విషలమయ్యారు. ఆ తర్వాత వీడియో షేర్ చేయగా అప్పుడు అసలైన కుక్క ఏదో తెలిసింది. మరి మీరు కూడా గుర్తుపట్టగలరా.. ఓ సారి ప్రయత్నించండి. (ప్రపంచంలోనే ఉత్తమ శబ్దం ఇది)
また彫刻と化していた pic.twitter.com/ZsC0pxBOPu
— はしもとみお (@hashimotomio) August 8, 2020
Comments
Please login to add a commentAdd a comment