జలచరాలన్ని సముద్రంలో ఓ పరిమిత లోతు వరకే జీవిస్తాయి. కానీ దాదాపు 8,336 లోతులో జీవించే ఓ చేపను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పేరు స్నెయిల్ ఫిష్(snail fish). యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టోక్యో యునివర్శిటీ ఆఫ్ మెరైన్ సైన్స్ అండ్ టెక్కాలజీ శాస్త్రవేత్తలు చేపల మనుగడపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్ర అగాధాల్లో వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ సమీపంలోని ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని అగాధంలో సముద్ర రోబోల కెమెరాకు ఓ అరుదైన చేప చిక్కింది.
శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అత్యంత లోతులో చిత్రీకరించిన చేపలు ఇవే కావడం గమనార్హం. సముద్ర రోబోల ద్వారా గత సెప్టెంబర్‌లో చిత్రీకరించిన వీడియో దృశ్యాలను ఇటీవల శాస్త్రవేత్తలు విడుదల చేశారు. చేపలు సముద్రంలో ఎంత లోతువరకు వెళ్లున్నాయో ఇది చూపిస్తోందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన, మిండెరూ- యూడబ్ల్యూఏ డీప్ సీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు, సముద్ర జీవశాస్త్రవేత్త అలాన్ జెమీసన్ అన్నారు. సముద్రంలోని చేపల మనుగడపై అధ్యయనం చేస్తున్నామని, ఇందులో భాగంగా జపాన్ పసిఫిక్ సముంద్రంలో ఇజు-ఒగాసవారా అగాధంలో 8,336 మీటర్ల లోతులో స్నెయిల్ ఫిష్‌ను గుర్తించామన్నారు.
ఈ స్నెయిల్ ఫిష్‌లు పిల్ల చేపలని.. తక్కువ లోతులో నివసించే పెద్ద జీవుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు వీలైనంత లోతుకు వెళ్తాయని జెమీసన్ చెప్పారు. ఇదిలా ఉంటే 2008లో 7,703 మీటర్ల లోతులో మాత్రమే చేపలను గుర్తించారు. కానీ తాజాగా 8,022 మీటర్ల లోతులో శాస్త్రవేత్తులు రెండు చేపలను పట్టుకున్నారు. ఇప్పటివరకు అత్యంత లోతులో చిక్కిన చేపలు ఇవేనని అలాన్ జెమీసన్ పేర్కొన్నారు. లోతైన జలాల్లో అక్కడి తీవ్ర పరిస్థితులను తట్టుకుని ఎలా జీవిస్తున్నాయో అధ్యయనం చేసేందుకు ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
🌊 Scientists from #UWA and Japan have set a new record for the deepest fish ever filmed and caught! 🐟 They discovered a snailfish at a depth of 8,336m in the Izu-Ogasawara Trench and caught two more from 8,022m during a two-month expedition. @minderoo https://t.co/RjJ7CxD97d pic.twitter.com/kRdYJsI3yU
— UWA (@uwanews) April 3, 2023
Comments
Please login to add a commentAdd a comment