
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రిసోల్–జు దాదాపు ఏడాది తర్వాత కనిపించారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి, మాజీ దేశాధినేత కిమ్ జోంగ్ ఇల్ జయంతి మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భర్తతో కలిసి రిసోల్–జు కూడా పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్‌తోపాటు ఆమె కూడా హాజరవుతారు. కానీ, గత ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కనిపించలేదు. అజ్ఞాతంలోనే ఉన్నారు. దీనిపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. చివరిసారిగా 2020 జనవరిలో ఆమె కనిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే రిసోల్–జు బహిరంగ ప్రదేశాల్లోకి రాలేదని ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: (శ్వేతసౌధం ఒక బంగారు పంజరం: బైడెన్)
ప్యాంగ్యాంగ్‌లో కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల్లో కిమ్ జోంగ్ ఉన్, ఆయన సతీమణి రిసోల్–జు
Comments
Please login to add a commentAdd a comment