కిమ్‌ హత్య చేయలేదు.. ఆమె బతికేవుంది | Kim did not murder his sole mate, ri sole jo is alive | Sakshi
Sakshi News home page

కిమ్‌ హత్య చేయలేదు.. ఆమె బతికేవుంది

Published Thu, Jul 13 2017 8:28 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

కిమ్‌ హత్య చేయలేదు.. ఆమె బతికేవుంది - Sakshi

కిమ్‌ హత్య చేయలేదు.. ఆమె బతికేవుంది

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఏం చేసినా వార్తగా మారుతోంది. మరీ.. ప్రపంచ వినాశనానికి కారణభూమమవుతాడని భావిస్తున్న వ్యక్తి ఏం చేసినా వార్తే కదా. తాజాగా తన భార్య రి సోల్‌ జుతో కలిసి బయటకు వచ్చారు కిమ్‌. సాధారణానికి భిన్నంగా ప్రవర్తించే కిమ్‌ బాటలోనే ఆయన భార్య కూడా నడుస్తారు. అందుకే నెలల తరబడి ఎవరికి కనిపించకుండా(బయటి ప్రపంచానికి) ఉంటారు.

ఎప్పుడో గానీ ఆవిడ ప్రజల ముందుకు రారు. తాజాగా  ఓ విందు కార్యక్రమానికి భార్యభర్తలు కలిసి హాజరుకావడంతో ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. కొన్ని ఫోటోలు మీడియాకు చిక్కడంతో కిమ్‌ భార్య బయటకు వచ్చారంటూ వార్తలు గుప్పుమన్నాయి. మరి మీరు ఓ సారి నియంత భార్యను చూసేయండి.

వాస్తవానికి కిమ్‌ తాత ఉత్తరకొరియా అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆయన భార్య బయటి ప్రపంచానికి కనిపించలేదు. ఆ సంప్రదాయన్నే కొనసాగంచిన కిమ్‌ నాన్న కూడా పాటించారు. అయితే భార్యను బయటి ప్రపంచంలోకి తీసుకువచ్చి కిమ్‌ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. అయితే అది అడపా దడపా మాత్రమే. ఆ మధ్య రెండు మూడు సార్లు వీరిద్దరూ కలిసి కన్పించారు.

ఇటీవల కాలంలో అది కూడా తగ్గిపోయింది. దీంతో ఆమె గర్భవతి అయి ఉంటుంది అందుకే బయటకు రావడం లేదని వార్తలు వచ్చాయి. అంతటితో ఆగకుండా కిమ్‌కు.. తన భార్యకు మధ్య విభేదాలు వచ్చాయని ఆమె కిమ్‌ నుంచి విడిపోవాలని అనుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. విభేదాలతో కిమ్‌ ఆమెను చంపేశారనే వార్తలు కూడా కొన్ని మీడియా సంస్ధలు ప్రచురించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన విందు కార్యక్రమంలో మళ్లీ వీరిద్దరూ కలిసి కన్పించడంతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement