కాన్‌బెర్రా: కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో పని భారం, ఒత్తిడి తగ్గుతాయని అందరూ అనుకున్నారు. అయితే కొందరికి మాత్రం పని భారం ఇంకా ఎక్కువైంది. స్కూళ్లు లేకపోవడం, పిల్లలు ఇంట్లోనే ఉండటంతో చాలా మందికి మాములుగా కంటే పని పెరిగింది. ఇలానే పని ఒత్తిడి పెరిగిన ఆస్ట్రేలియన్ మహిళ కోడీ క్విన్లివన్ బట్టలను ఉతకకుండా అన్నింటిని ఒక రూంలో పడేసింది. దీంతో బట్టలు ఉతికి రెండు నెలలకు పైగా కావడంతో కొండలా పేరుకుపోయాయి.
ఇక చేసేది ఏం లేక ఆమె వాటిని లాండ్రీ షాపుకు పంపాలనుకుంది. అయితే దానికి ముందు ఆమె వాటిపై ఎక్కి కూర్చొని ఒక ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి ‘మౌంట్ ఫోల్డ్ మోర్’ అనే పేరు పెట్టింది. అయితే దీనిని చూసిన కొంత మంది ఆ ఫోటోలో ఆమె మహారాణిలా ఫోజ్ ఇచ్చింది అని కామెంట్ చేస్తున్నారు. ‘నేనొక్కదాన్నే కాదు ఇలా చాలా మంది ఉన్నందకు ఆనందంగా ఉంది’ అని కామెంట్ చేసింది. లాండ్రీకి పంపిన తరువాత వాటిని ఉతికి, ఐరన్ చేసి 50 సంచుల్లో కోడీకి అందించారు.
Comments
Please login to add a commentAdd a comment