క్వీన్స్‌ల్యాండ్: సుమారు 18 అడుగుల పొడవు.. టన్ను బరువుండే మొసలి కాసియస్ చనిపోయింది. ఆస్ట్రేలియాలోని సంరక్షణ కేంద్రంలో ఎన్‌క్లోజర్‌లో విగతజీవిగా ఉన్న కాసియస్‌ను శనివారం ఉదయం సిబ్బంది గమనించారు. దీని వయస్సు 110 ఏళ్ల పైమాటేనని గ్రీన్‌ల్యాండ్‌లోని కైర్న్‌లో ఉన్న మెరైన్‌ల్యాండ్ మెలనేసియా క్రొకోడైల్ హ్యాబిటాట్ తెలిపింది. భారీ ఆకారంలో ఉండే ఈ మొసలి మొదట్లో జంతువులు, మనుషులపై దాడి చేసేది.
దీనిని ఈ సంరక్షణా కేంద్రాన్ని నెలకొలి్పన జార్జి క్రెయిగ్ 1987లో ఇక్కడికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడి సందర్శకులకు కాసియస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. జార్జి క్రెయిగ్ వేరే ప్రాంతానికి బదిలీ అయిన అక్టోబర్ 15వ తేదీ నుంచి కాసియస్ ఆరోగ్యం క్షీణించడం మొదలైందని సంరక్షణ కేంద్రం తెలిపింది. సాధారణ మొసళ్ల కంటే చాలా ఎక్కువ కాలమే బతికిన కాసియస్ తమకు మంచి మిత్రుడంటూ నివాళులరి్పంచింది.
Comments
Please login to add a commentAdd a comment