Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Coalition government campaigned by saying it would approve 19 projects1
పాత ప్రాజెక్టులకే కొత్త పూత..!

సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తాము సాధించినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కారు విఫలయత్నం చేస్తోంది. పాత ఒప్పందాలు, ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి విస్తరణ చేపట్టిన వాటిని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొంటూ గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 6వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం రూ.33,720 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచి్చనవే కావడం గమనార్హం. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. » జపాన్‌కు చెందిన ఏటీసీ టైర్స్‌ (యకహోమా) రూ.3,079 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు 2020 నవంబరులో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవగా 2022 ఆగస్టులో వైఎస్‌ జగన్‌ ఈ పరిశ్రమను ప్రారంభించారు. తొలి దశలో రూ.1,750 కోట్లు పెట్టిన ఏటీసీ టైర్స్‌ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అప్పుడే రెండో దశను కూడా ప్రకటించింది. కానీ, ఈ విస్తరణ ప్రతిపాదనను కూటమి సర్కారు నిస్సిగ్గుగా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది. » పీఎల్‌ఐ కింద డైకిన్‌ సంస్థ శ్రీ సిటీలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఎయిర్‌ కండిషన్‌ తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని 2022లో మొదలుపెట్టింది. 2023 నవంబరులో ఉత్పత్తి కూడా ప్రారంభించింది. రూ.1,000 కోట్లతో 75 ఎకరాల్లో యూనిట్‌ ఏర్పాటు చేసిన డైకిన్‌ విస్తరణ కోసం 2024లో మరో 33 ఎకరాలను కొనుగోలు చేసింది. దీన్ని కూడా కూటమి సర్కారు తన ఖాతాలో వేసుకుంది.»డీఆర్‌డీవోతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నవంబరులో రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి గిరిధర్‌ నాటి సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. అదే రోజు మచిలీపట్నంలో జరిగిన బీఈఎల్‌ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో యూనిట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇదేదో కొత్తగా వచ్చినట్లు ఇప్పుడు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.» దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌కు తూర్పుగోదావరి జిల్లా కేశవరం వద్ద ఎప్పటినుంచో ప్రత్యేక రసాయనాల తయారీ యూనిట్‌ ఉంది. ఏలూరు జిల్లా వట్టిగుడిపాడులో మోహన్‌ స్పిన్‌టెక్‌ 2007లో అప్పటి సీఎం వైఎస్సార్‌ హయాంలోనే యూనిట్‌ నెలకొల్పింది. రామభద్ర ఇండస్ట్రీస్‌ 2006లో తణుకు కేంద్రంగా ఏర్పాటైంది. ఈ కంపెనీల విస్తరణ ప్రాజెక్టులకు తాజాగా ఎస్‌ఐపీబీ ఓకే చెప్పింది. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతి పరిశీలనకు డాష్‌ బోర్డ్‌ తీసుకురావాలి. టూరి­జంలో హోటళ్లు, రూముల కొరత ఉంది. కొత్తగా 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తీసుకురావాలి. కారవాన్స్‌కు సంబంధించిన పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు ప్రారంభించాలి. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చిన్నచిన్న ప్లాంట్ల ద్వారా సర్క్యులర్‌ ఎకానమీగా మార్చాలి’ అని సూచించారు.

Pak PM Shehbaz Sharif Offers India For Peace Talks2
పాక్‌ ప్రధాని సంచలన ప్రకటన

ఇస్లామాబాద్: భారత్‌ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్‌.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్‌ వెల్లడించారు.పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ సందర్శించారు. అనంతరం, షరీఫ్‌ పాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్‌ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. అలాగే, జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాక్‌ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధం తర్వాత.. పాక్‌ ప్రధాని షరీఫ్‌ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.Peace and Pakistan, Biggest Joke of the decade 😆“Pakistan's prime minister, Shehbaz Sharif, said on Thursday he was ready to engage in peace talks with India. Prime Minister Shehbaz Sharif extended an offer of talks to India, saying Pakistan is ready to engage "for peace". pic.twitter.com/NHvt1DNqsB— Vaibhav Rathi 🇮🇳 (@Vaibhavrathi05) May 16, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్‌ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్‌ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు. This video explains the extent of damage caused by @IAF_MCC in Pakistan. Pak PM took a dusty road to reach the PAF base. You know why? Watch this. 👇pic.twitter.com/XYQLEWWB0P— Pramod Kumar Singh (@SinghPramod2784) May 15, 2025

SP leader Ram Gopal Yadav controversial comments on Wing Commander Vyomika Singh3
దుమారం.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: ఉత్త‌ర ప్ర‌దేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్‌ యాదవ్‌ (Ram Gopal Yadav) వింగ్ క‌మాండ్ వ్యోమికా సింగ్‌పై (Vyomika Singh)వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.ఇటీవల, కల్నల్‌ సోఫియా ఖురేషీ (Sofia Khureshi)పై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని రామ్ గోపాల్ యాదవ్ తాజాగా, ప్రస్తావిస్తూ.. ‘వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబ‌ట్టే ఆమెను వ‌దిలేసి.. ముస్లిం మతానికి చెందిన క‌ల్న‌ల్ సోఫియా ఖురేషీ గురించి విజ‌య్ షా మాట్లాడారని అన్నారు. 🚨SP’s Ramgopal Yadav hurls CASTEIST slur at Wing Commander Vyomika Singh - calls her “CHAM*R” 😳~ No outrage. No suo moto by courts. No feminist noise.Because the abuser isn’t from BJP, and the victim isn’t convenient for the ecosystem👏🏼 pic.twitter.com/BXegkYPAg5— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 15, 2025ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మోరాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాద‌వ్ పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మంలో మంత్రి విజ‌య్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించారు. ‘ఓ మంత్రి క‌ల్న‌ల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మ‌త‌త‌త్వ వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్ల‌ని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సంద‌ర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్ష‌ల్ ఏకే భార‌తి కులాల ప్రస్తావనకు తెచ్చారు. అదే సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు. सेना की वर्दी 'जातिवादी चश्मे' से नहीं देखी जाती है। भारतीय सेना का प्रत्येक सैनिक 'राष्ट्रधर्म' निभाता है, न कि किसी जाति या मजहब का प्रतिनिधि होता है।समाजवादी पार्टी के राष्ट्रीय महासचिव द्वारा एक वीरांगना बेटी को जाति की परिधि में बांधना न केवल उनकी पार्टी की संकुचित सोच का…— Yogi Adityanath (@myogiadityanath) May 15, 2025 సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహంరామ్‌ గోపాల్‌ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు కాదని అన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్‌ చేశారు.

IPL 2025 Restart: Who's Back.. Who's Replaced4
ఐపీఎల్‌ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..?

భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడ్డ ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్‌ జూన్‌ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. యుద్దం కారణంగా మధ్యలో వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఎవరు తిరిగొస్తున్నారు.. తిరిగి రాని వారికి ప్రత్యామ్నాయాలు ఎవరు అన్న సమాచారాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం. తిరిగి రాని​ విదేశీ క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్‌ బోర్డు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.గుజరాత్‌ టైటాన్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..జోస్‌ బట్లర్‌ (దేశీయ విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)కగిసో రబాడషెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌రషీద్‌ ఖాన్‌దసున్‌ షనకకరీమ్‌ జనత్‌గెరాల్డ్‌ కొయెట్జీప్రత్యమ్నాయ ఆటగాళ్లు..కుసాల్‌ మెండిస్‌ (బట్లర్‌కు ప్రత్యామ్నాయం, ప్లే ఆఫ్స్‌ కోసం)ఆర్సీబీతిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..ఫిల్‌ సాల్ట్‌ లియామ్‌ లివింగ​్‌స్టోన్‌జేకబ్‌ బేతెల్‌రొమారియో షెపర్డ్‌టిమ్‌ డేవిడ్‌లుంగి ఎంగిడినువాన్‌ తుషారఢిల్లీ క్యాపిటల్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..డుప్లెసిస్‌సెదిఖుల్లా అటల్‌ట్రిస్టన్‌ స్టబ్స్‌డొనొవన్‌ ఫెరియెరాదుష్మంత చమీరాప్రత్యమ్నాయ ఆటగాళ్లు..ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (జేక్‌ ఫ్రేజర్‌కు ప్రత్యామ్నాయం)* ముస్తాఫిజుర్‌కు ఇంకా అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు నుంచి అనుమతి రాలేదు. * మిచెల్‌ స్టార్క్‌ అందుబాటులోకి వచ్చేది లేనది ఇంకా తెలియ రాలేదు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..సునీల్‌ నరైన్‌ఆండ్రీ రసెల్‌క్వింటన్‌ డికాక్‌రహ్మానుల్లా గుర్బాజ్‌స్పెన్సర్‌ జాన్సన్‌అన్రిచ్‌ నోర్జేతిరిగి రాని ఆటగాళ్లు..రోవ్‌మన్‌ పోవెల్‌ (ఆరోగ్య సమస్య)మొయిన్‌ అలీ (కుటుంబ ఆరోగ్య సమస్య)పంజాబ్‌ కింగ్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌మార్కో జన్సెన్‌జేవియర్‌ బార్ట్‌లెట్‌ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..కైల్‌ జేమీసన్‌ (ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయం)మిచెల్‌ ఓవెన్‌ (మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాం, ఐపీఎల్‌ వాయిదాకు ముందే ఎంపిక)* స్టోయినిస్‌, ఆరోన్‌ హార్డీ, జోస్‌ ఇంగ్లిస్‌పై ఇంకా స్పష్టత లేదు (పంజాబ్‌ తొలి మ్యాచ్‌ తర్వాత రావచ్చు)లక్నో సూపర్‌ జెయింట్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..డేవిడ్‌ మిల్లర్‌మార్క్రమ్‌మిచెల్‌ మార్ష్‌మాథ్యూ బ్రీట్జ్కీనికోలస్‌ పూరన్‌షమార్‌ జోసఫ్‌ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..విలియర్‌ ఓరూర్కీ (మయాంక్‌ యాదవ్‌కు ప్రత్యామ్నాయం)సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..పాట్‌ కమిన్స్‌ట్రవిస్‌ హెడ్‌వియాన్‌ ముల్దర్‌కమిందు మెండిస్‌హెన్రిచ్‌ క్లాసెన్‌ఎషాన్‌ మలింగరాజస్థాన్‌ రాయల్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..హసరంగమఫాకఫజల్‌హక్‌ ఫారూకీతీక్షణబర్గర్‌తిరిగి రాని ఆటగాళ్లు..జోఫ్రా ఆర్చర్‌ (రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు)* హెట్‌మైర్‌ రావడం అనుమానమేచెన్నై సూపర్‌కింగ్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..డెవాల్డ్‌ బ్రెవిస్‌రచిన్‌ రవీంద్రడెవాన్‌ కాన్వేనాథన్‌ ఇల్లిస్‌పతిరణనూర్‌ అహ్మద్‌తిరిగి రాని ఆటగాళ్లు..సామ్‌ కర్రన్‌జేమీ ఓవర్టన్‌ముంబై ఇండియన్స్‌తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..విల్‌ జాక్స్‌ (ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)కార్బిన్‌ బాష్‌మిచెల్‌ సాంట్నర్‌రికెల్టన్‌రీస్‌ టాప్లేట్రెంట్‌ బౌల్ట్‌ముజీబ్‌ రెహ్మాన్‌

Minister Nara Lokesh Comments On Red Book5
రెడ్‌బుక్‌ మరువను: మంత్రి నారా లోకేశ్‌

గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి నారాలోకేశ్‌ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్‌.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్‌ రెడ్‌బుక్‌ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్‌ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్‌ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్‌ విండ్‌ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.

Rasi Phalalu: Daily Horoscope On 16-05-2025 In Telugu6
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు

గ్రహం అనుగ్రహం: విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి: బ.చవితి రా.2.31 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మూల ప.2.02 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.19 నుండి 2.02 వరకు, తదుపరి రా.12.06 నుండి 1.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.21నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: ఉ.7.10 నుండి 8.44 వరకు.సూర్యోదయం : 5.32సూర్యాస్తమయం : 6.20రాహుకాలం : ఉ.10.30నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకుమేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు.వృషభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం అంతగా ఉండదు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.మిథునం: ముఖ్య కార్యాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి.కర్కాటకం: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు సత్కారాలు.సింహం: కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అరోగ్యసమస్యలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు చికాకులు.కన్య: కష్టమే మిగులుతుంది. అనుకున్న కార్యాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.వృశ్చికం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు బదిలీ సూచనలు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి అందని సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహం.మకరం: రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం.కుంభం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకర సంఘటనలు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. రాజకీయవేత్తలు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

Nifty 25000 Points Hike First in 20257
ట్రంప్ ప్రకటన: ఒక్కసారిగా మారిపోయిన స్టాక్ మార్కెట్లు

ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్‌ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్‌ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్‌ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్‌ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి.ఇదీ చదవండి: మరింత తగ్గుతున్న గోల్డ్ రేటు: ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి..వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

Hit 3 Actress Komali Prasad One Of The Best Doctor Do You Now8
హిట్‌3 నటి 'కోమలి ప్రసాద్' ఎవరో తెలుసా..?

ఇప్పుడు నటీనటులు ఒక్క భాషలో నటిస్తే చాలు. ఇతర భాషల్లోనూ ఇట్టే ఛాన్సులు అందిపుచ్చుకుంటున్నారు. అలా ఇతర భాషల్లోనూ అవకాశాలు పొందుతూ తమ సత్తాను చాటుకుంటున్నారు. అలా కోలీవుడ్‌లో పాగా వేయాలని ఆశపడుతున్న టాలీవుడ్‌ నటి కోమలి ప్రసాద్‌(Komalee Prasad). పదహారణాల తెలుగు అమ్మాయి అయినా ఈమె ప్రతిభ పాటవాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కోమలి ప్రసాద్‌లో నటి మాత్రమే కాకుండా ఒక వైద్యురాలు (డెంటిస్ట్‌), జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్‌ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్‌ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్‌ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి. ఇప్పటికే తెలుగులో నెపోలియన్‌,హిట్‌2, రౌడీ బాయ్స్‌, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్‌ తాజాగా నాని కథానాయకుడిగా నటించిన హిట్‌–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను కోమలి ప్రసాద్‌ పంచుకుంటూ హిట్‌–3 చిత్రంలో తాను పోషించిన ఎస్పీ వర్షా పాత్ర శారీరకంగానూ, మానసికంగానూ చాలెంజ్‌ అనిపించిందన్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్‌ అనిల్‌ వద్ద శిక్షణ పొందినట్లు చెప్పారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు. ఈ చిత్రంలో నానితో కలిసి నటించడం మంచి అనుభవం అని, ఆయన చాలా సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రంలోనూ నటించాలన్నది తన కలగా పేర్కొన్నారు. తమిళ చిత్రాలపై ఆశతో తమిళభాషను సరళంగా మాట్లాడడం నేర్చుకున్నానని చెప్పారు. సి. ప్రేమ్‌కుమార్, ఆల్‌ ఫోన్స్‌ పుత్తిరన్, మణికంఠన్, గౌతమ్‌మీనన్‌ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు, అజిత్‌ ఎప్పటికీ తన ఫేవరెట్‌ అని, ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు కోమలి పేర్కొన్నారు.

Shafali varma comeback in T20s9
టి20ల్లో షఫాలీ పునరాగమనం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో 5 టి20లు, 3 వన్డేల్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించారు. టి20ల కోసం 15 మందిని, వన్డేలకు 16 మందిని ఎంపిక చేయగా... రెండు టీమ్‌లకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు మన జట్టు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్‌ ఇదే కానుంది. దూకుడైన ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ భారత జట్టులో పునరాగమనం చేసింది. గత ఏడాది అక్టోబరు తర్వాత ఆమె స్థానం కోల్పోయింది. ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫు 9 మ్యాచ్‌లలో 304 పరుగులు చేసి షఫాలీ సత్తా చాటింది. అయితే షఫాలీని టి20లకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డే జట్టులో స్థానం కల్పించలేదు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో మణికట్టు గాయంతో ఆమె ఆటకు దూరమైంది. యస్తికకు వన్డే, టి20 రెండు టీమ్‌లలో చోటు లభించింది. ఇటీవల శ్రీలంకతో ముక్కోణపు టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన స్నేహ్‌ రాణా కూడా టి20ల్లో మళ్లీ చోటు దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి టి20 టీమ్‌లోకి ఎంపికైంది. హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి కూడా టి20 జట్టులోకి పునరాగమనం చేసింది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్‌ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే. భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, తేజల్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్‌ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే.భారత్, ఇంగ్లండ్‌ సిరీస్‌ షెడ్యూల్‌ తొలి టి20: జూన్‌ 28 నాటింగ్‌హామ్‌ రెండో టి20: జూలై 1 బ్రిస్టల్‌ మూడో టి20: జూలై 4 ఓవల్‌ నాలుగో టి20: జూలై 9 మాంచెస్టర్‌ ఐదో టి20: జూలై 12 బర్మింగ్‌హామ్‌ తొలి వన్డే: జూలై 16 సౌతాంప్టన్‌ రెండో వన్డే: జూలై 19 లార్డ్స్‌ మూడో వన్డే: జూలై 22 చెస్టర్‌ లీ స్ట్రీట్‌

Uganda pride and reigning Miss Uganda Natasha Nyonyozi special story10
మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్‌ యుగాండా!

కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్‌ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్‌ ఉంది. స్కిన్‌ కేర్, మేకప్, యాక్సెసరీస్‌ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్‌ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.బ్యూటీ విత్‌ పర్పస్‌మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్‌ నీడ్స్‌ పిల్లలకు కావలసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్‌ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్‌ నీడ్‌ చిల్డ్రన్‌ కోసం కూడా ఓ సెక్షన్‌ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్‌నెస్‌ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్‌ నీడ్‌ పిల్లల కోసం హెల్త్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ డెవలప్‌ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్‌ పర్పస్‌ అదే! అలాగే టాలెంట్‌ రౌండ్‌లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్‌ రౌండ్‌లో స్విమ్మింగ్‌. స్విమింగ్‌ ఈజ్‌ మై ఫేవరిట్‌ స్పోర్ట్‌.మర్యాద, మాట తీరు..రిచ్‌ కల్చర్, ట్రెడిషన్‌ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్‌ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్‌ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా. అందుకే కనెక్ట్‌ అయ్యాను.. నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు బిగ్‌ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్‌ అయ్యాను. విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు! – నటాషా న్యో న్యో జీ – యుగాండా– సరస్వతి రమ

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement