
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల క్లబ్‌లో శుక్రవారం ఉదయం షటిల్ ఆడుతూ బూస వెంకటరాజగంగారాం(53) గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన వెంకటరాజగంగారాం తన స్నేహితులతో కలిసి క్లబ్‌లో షటిల్ ఆడుతున్నాడు.
అకస్మాత్తుగా కిందపడిపోవడంతో స్నేహితులు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన మృతికి క్లబ్ కార్యదర్శి ముస్కు నారాయణరెడ్డి, సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.