
కామారెడ్డి బస్సులో కిక్కిరిసిన జనం
సమయానికి బస్సులు రాక సోమవారం సిరిసిల్ల బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేడారం జాతరకు సిరిసిల్ల డిపో నుంచి 32 బస్సులు పంపించారు. డిపోలో మొత్తం 61 బస్సులు ఉండగా అందులో సగం జాతరకు పంపడంతో బస్సుల కొరత ఏర్పడి, సమయానికి రాక ప్రయాణికులు చాలాసేపు నిరీక్షించారు. తీరా బస్సులు బస్టాండ్‌కు రావడంతో సీట్లకోసం ఎగబడ్డారు. నిల్చోడానికి చోటు లేక చివరికి ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేశారు. అసలే పెళ్లిల్ల సీజన్ కావడంతో జనంతో బస్టాండ్ కిక్కిరిసింది. చాలా సేపు బస్సులకోసం వేచి చూసి గత్యంతరం లేక సమయానికి ఇంటికి చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావంచిన ఆటోవాలాలు అధిక చార్జీలు వసూలు చేశారు. ఇదేం గోసరో నాయనా అంటూ జనం ప్రయాణం సాగించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ


Comments
Please login to add a commentAdd a comment