విజయీభవ..
‘పది’లో శతశాతం దిశగా..
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం ● జిల్లావ్యాప్తంగా 11,855 విద్యార్థులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
7
వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించొద్దు
జగిత్యాలటౌన్: కని.. పెంచిన తల్లిదండ్రుల సంక్షేమాన్ని
కొడుకులు విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు అసోసియేషన్‌కు బాధితులు సాతంశెట్టి కనకయ్య, వరమ్మ, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, మల్యాల కొడిమ్యాల మండలాలకు చెందిన పలువురు వృద్ధులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాకేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయానికి వారివారి కొడుకులు, కోడళ్లను పిలిపించి కౌన్సెలింగ్ చేపట్టారు. తల్లిదండ్రుల సంక్షేమాన్ని చూసేందుకు సమ్మతించిన వారితో ఒప్పందపత్రం రాయించుకున్నారు. హరి అశోక్‌కుమార్, గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాశ్‌రావు, విఠల్, బైరి రాధ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
జగిత్యాల: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22 వరకు కొనసాగనున్నాయి. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. హాల్‌టికెట్లను నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 28 కేంద్రాల్లో 14 సెంటర్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. ఒకటి మోడల్‌స్కూల్‌లో.. 13 ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పరీక్షలు జరుగనున్నాయి.
అధికారుల ఏర్పాట్లు
పరీక్షల నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్స్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావద్దని, భయాందోళన వీడి.. ప్రశ్నపత్రం క్షుణ్ణంగా చదివి జవాబులు రాయాలని సూచించారు. సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
మొత్తం పరీక్ష కేంద్రాలు 28
మొత్తం విద్యార్థులు 14,450
ఫస్టియర్ విద్యార్థులు 7,073
సెకండియర్ విద్యార్థులు 7,377
మంచి గ్రేడ్ సాధిస్తా..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం నిబంధన లేదు
హెల్ప్‌లైన్ నంబరు 94403 81255
విజయీభవ..
విజయీభవ..
విజయీభవ..
విజయీభవ..
విజయీభవ..
విజయీభవ..
విజయీభవ..
Comments
Please login to add a commentAdd a comment