కమనీయం నృసింహుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం నృసింహుని కల్యాణం

Published Wed, Mar 5 2025 1:43 AM | Last Updated on Wed, Mar 5 2025 1:39 AM

కమనీయ

కమనీయం నృసింహుని కల్యాణం

రాయికల్‌: రాయికల్‌ మండలం భూపతిపూర్‌ గ్రామంలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం కనులపండువగా నిర్వహించారు. ఆలయంలోని ఉ త్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం

జగిత్యాలటౌన్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం చేపట్టారు. వేదపండితులు తిగుళ్ల విషుశర్మ పర్యవేక్షణలో సంగనపట్ల నరేంద్రశర్మగాత్రంతో పా రాయణం ప్రారంభించారు. హనుమాన్‌ జ యంతి వరకు ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల దాకా పారాయణం కొనసాగుతుందని ఆలయవర్గాలు తెలిపాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు బట్టు సుధాకర్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, అనంతుల ప్రేంకుమార్‌, కొత్తపల్లి నాగభూషణం, మానుక సంతోష్‌, బేతి కృష్ణారెడ్డి, ఎర్ర రంజిత్‌కుమార్‌, నూనె రాధాకృష్ణ, ముసిపట్ల లక్ష్మీనారాయణ, జైశెట్టి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పపల్లిలో నీటి కష్టాలు

కథలాపూర్‌: మండలంలోని ఇప్పపల్లిలో నీటికష్టాలు ప్రారంభమయ్యాయి. నాలుగో వార్డులో బోరుబావిలో నీరు అడుగంటిపోవడంతో స్థానికులకు సరిపడా నీరు రావడం లేదు. దీంతో మంగళవారం నుంచి పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు.

లింగ నిర్ధారణ నేరం

జగిత్యాల: లింగ నిర్ధారణ నేరమని, ఎవరైనా పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని మాతా శిశు సంరక్షణాధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పలు స్కానింగ్‌ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. స్కానింగ్‌ సెంటర్‌లో ఫారం ఎఫ్‌ నివేదికను ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని ఆదేశించారు. ప్రతినెలా 5వ తేదీలోపు ఉండాలన్నారు. ఆయన వెంట డెకా యి ఆపరేషన్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ సాయిసుధ, సఖీ కో–ఆర్డినేటర్‌ లావణ్య, అశ్విని, భూమేశ్వర్‌, తరాల శంకర్‌, రాజేశ్వరి ఉన్నారు.

గోదావరిలో షవర్లు ఏర్పాటు

ధర్మపురి: రానున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి వద్దగల గోదావరిలో భక్తులు స్నానాలు చేసేందుకు షెవర్లు ఏర్పాటు చేశారు. మంగలిగడ్డ పుష్కరఘాట్ల వద్ద నీరు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు స్నానాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఘాట్ల వద్దనే షవర్లను ఏర్పాటు చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కమనీయం నృసింహుని కల్యాణం1
1/2

కమనీయం నృసింహుని కల్యాణం

కమనీయం నృసింహుని కల్యాణం2
2/2

కమనీయం నృసింహుని కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement