సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని వెంటవెంటనే జియోట్యాగ్ ద్వారా ఫొటోలను క్యాప్చర్ చేస్తే లబ్ధిదారులకు త్వరగా బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. బీర్‌పూర్ మండలం చిత్రవేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. గ్రామంలో 74 ఇళ్లకు 18 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మరో 12 ఇళ్లు రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు దగ్గరుండి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం బీర్‌పూర్ పీహెచ్‌సీ పనులు, బీర్‌పూర్, సారంగాపూర్ ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. ఆ యన వెంట సారంగాపూర్, బీర్‌పూర్ ఎంపీడీవోలు గంగాధర్, లచ్చాలు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment