వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్లాపూర్: గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. ఇళ్లలో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొ లగించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణకు డ్రైనేజీల్లో మందు చల్లించాలని ప్రత్యేకాధికారులు, పంచాయతీ, వైద్యసిబ్బందికి సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పీహెచ్‌సీ మెడికల్ అధికారి వాహిని, సీహెచ్‌వో.రామ్మోహన్, హెచ్‌ఈవో వేణురావు, పీహెచ్‌ఎన్ ఇందిర, హెల్త్ సూపర్‌వైజర్ ప్రభావతి, ఫార్మసిస్ట్ మహేశ్వరి పాల్గొన్నారు.
బతికపల్లిలో పురాతన నాణేలు లభ్యం
పెగడపల్లి: మండలంలోని బతికపలిలో అతిపురాతనమైన నాణేలు లభ్యమయ్యాయి. గ్రామ శివారులోని పెద్దగుట్టపై ఉపాధిహామీ కూలీలు కాంటూరు కందకాలు తవ్వుతున్నారు. బుధవారం దావుల జమున, మల్యాల శ్యామల కందకాలు తవ్వుతుండగా వెండిని పోలి, ఉర్దూభాషలో రాసిఉన్న 20 పురాతనమైన నాణేలు లభ్యమయ్యాయి. వారు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి నిఖిల్‌రెడ్డికి సమాచారం అందించారు. వారు అధికారులకు తెలపగా ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై రవికిరణ్, ఆర్‌ఐ జమున సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నాణేలను జగిత్యాల పురావస్తుశాఖకు అప్పగించనున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు.
జిల్లా ఉద్యానశాఖ అధికారిగా శ్యాంప్రసాద్
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా ఉద్యానశాఖాధికారిగా జి.శ్యామ్‌ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన దేవప్రసాద్‌ను రాష్ట్ర హార్టికల్చర్ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు. దీంతో జిల్లాలో ఉద్యానశాఖ టెక్నికల్ అఫీసర్‌గా పనిచేస్తున్న శ్యామ్‌ప్రసాద్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆస్పత్రులు నిబంధనల ప్రకారం పనిచేయాలి
జగిత్యాల: ఆస్పత్రులను నిబంధనల ప్రకారం నడిపించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పీసీపీ ఎన్డీటీ నోడల్ ఆఫీసర్ సూర్యశ్రీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రులను డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశా రు. ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్‌లో నమోదైన డాక్ట ర్లు మాత్రమే సేవలందించాలన్నారు. రికార్డులు, స్కానింగ్ యంత్రాల రికార్డులు మెయింటేన్ చేయాలన్నారు. ప్రతినెలా 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫాం–ఎఫ్ నివేదిక అందించాలన్నారు. మాత శిశు సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి, డెకాయి ఆపరేషన్ కమిటీ సభ్యులు సాయిసుధ, లావణ్య, అశ్విని, భూమేశ్వర్ పాల్గొన్నారు.
సర్వీస్ నుంచి ఇద్దరు టీచర్ల తొలగింపు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఖాజీపుర ఉర్దూమీడియం పాఠశాలలో లాంగ్వేజ్ పండిట్ ఫహీమ్‌జహాన్ 2022 నవంబర్ 1 ఒకటి నుంచి విధులకు రావడంలేదు. అలాగే ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల లాంగ్వేజ్ పండిట్ తహసీమ్ సుల్తానా 2022 జూన్ ఒకటి నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 260 ప్రకారం వీరిద్దరినీ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈవో రాము తెలిపారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment