సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● సైబర్‌క్రైమ్ డీఎస్పీ డీవీ.రంగారెడ్డి
జగిత్యాలక్రైం: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైం డీఎస్పీ డీవీ.రంగారెడ్డి అన్నారు. బుధవారం సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై జాగృక్త దివస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతినెలా మొదటి బుధవారం నలంద డిగ్రీ కళాశాలలో సైబర్ జాగృక్త దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, ప్రజలకు సైబర్ భద్రతపై, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాను పిల్లలు ఎక్కువగా వాడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు. మహిళలు హక్కులు, రక్షణకు షీటీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. స్కూళ్లు, కళాశాల, బస్టాండ్‌లలో అమ్మాయిలను వేధిస్తే షీటీం పోలీస్ హెల్ప్‌లైన్ నంబరు 8712670783కి లేదా 100కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో షీటీం ఇన్‌చార్జి సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైం ఎస్సై దినేశ్ పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment