వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలి
రాయికల్/ఇబ్రహీంపట్నం: గ్రామీణ నిరుద్యోగ యువత వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తెలిపారు. పట్టణంలోని చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం సర్టిఫికెట్లు అందించారు. హోంమేడ్ హెల్త్ నర్సింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ తీసుకుని ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఇటిక్యాలలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆఫీసర్ మహేశ్, ప్రతిమ ఫౌండేషన్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్, ఫౌండేషన్ మేనేజర్ గీతారెడ్డి, ట్రస్ట్ ఇన్‌చార్జి ముత్యపు రాజిరెడ్డి, ప్రతినిధులు రాజిరెడ్డి, రఘుపతి, శ్యామల పాల్గొన్నారు.
సోలార్ ప్రాజెక్టులకు చేయూత
దేశంలో పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ చేయూతనిస్తున్నారని విద్యాసాగర్‌రావు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా టాటాస్ట్రైవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సోలార్, బ్యాంకింగ్, ఏసీ, రిఫ్రిజిరేటర్‌లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోలార్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మాజీ అధ్యక్షు డు మోరపెల్లి సత్యనారాయణరావు, టాటాస్ట్రైవ్ ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్, అమ్మక్కపే ట సెంటర్ మేనేజర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
● మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment