నేరాల ఛేదనలో జాగిలాల పాత్ర కీలకం
జగిత్యాలక్రైం: నేరాల ఛేదనలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. ఎస్పీ కార్యాలయం సమీపంలో పోలీసు జాగిలాల కోసం నిర్మించిన ప్రత్యేక భవనాన్ని ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. నేరాల నిరోధం, విచారణ, భద్రతపరమైన చర్యల్లో జాగిలాలు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. అధిక సామర్థ్యం, విశ్వనీయత, ప్రత్యేక శిక్షణతో పోలీసులకు సహాయపడుతున్నాయని తెలిపారు. హత్యలు, దోపిడీలు జరిగిన సమయాల్లో నిందితులను పట్టించడం.. సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నివారించడంలో కృషి చేస్తున్నాయని తెలిపారు. మాదకద్రవ్యాలు, బాంబులు, ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఉపయోగపడుతున్నాయని వివరించారు. ప్రస్తుతం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆరు జాగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణకు ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. అనంతరం శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డాగ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెడల్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు కిరణ్‌కుమార్, వేణు, వేణుగోపాల్, ఎస్బీ ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, శ్రీధర్, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment