కోరుట్ల మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
కోరుట్ల: ఇంటింటి సర్వే నిర్వహించిన ఎన్యుమరేట్లకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం.. విధుల్లో నిర్లక్ష్యం.. తోటి ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం వెరసి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోరుట్ల బల్దియాలో రెండునెలల క్రితం చేపట్టిన ఇంటింటి సర్వేలో 156 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాయికల్‌లో పనిచేసిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల వేతనాలు కోరుట్ల మున్సిపాల్టీకి, ఇక్కడ పనిచేసిన వారి వేతనాలు అక్కడికి బదిలీ అయినట్లు సమాచారం. దీంతో కొంతమంది ఎన్యుమరేటర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే విధుల్లోనూ నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. టీపీవో సెలవుపై వెళ్లిన విషయం చర్చనీయాంశంగా మారింది. శానిటేషన్ విధుల్లోనూ నిర్లక్ష్యంపై కొందరు ఉద్యోగులు జువ్వాడి నర్సింగరావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో కమిషనర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల: జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 6,387 మంది విద్యార్థులకు 6,259 మంది హాజరయ్యారు. కోరుట్లలో ఇద్దరు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఆశాల ఆందోళన
జగిత్యాలటౌన్: ఆశావర్కర్‌పై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని శిక్షించాలని ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆశావర్కర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పోలీసుల వైఖరి నిందితుడిని రక్షించేలా ఉందన్నారు. ఈనెల 27న దుబ్బరాజన్న జాతర విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఆమెను బెదిరించి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన జరిగి తొమ్మది రోజులు గడుస్తున్నా పోలీసుల నుంచి స్పందన లేదన్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాల్సి ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కలెక్టర్ స్పందించకపోవడం దారుణమన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, సీఐటీయూ నాయకులు తిరుపతినాయక్, ఇందూరి సులోచన పాల్గొన్నారు.
పసుపు బోర్డుతో ఒరిగిందేమీలేదు
మల్లాపూర్ : పసుపు పంటకు మద్దతు ధర రూ.20వేలు ప్రకటించాలని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంతోపాటు కొత్తదాంరాజుపల్లి, చిట్టాపూర్ గ్రామాల్లో రైతులను కలిసి ప్రధాన కూడళ్ల వద్ద నిరసన తెలిపారు. పసుపు మద్దతు ధర కోసం ఈనెల 11న చేపట్టనున్న ‘చలో మెట్‌పల్లి మహార్యాలీ’ని విజయవంతం చేయాలన్నారు. పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని అనేక ఆందోళనలు నిర్వహించామని, స్పందించిన కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, నిధులు కేటాయించకపోవడంతో కార్యకలాపాలు కొనసాగడం లేదని పేర్కొన్నారు. ఎకరాన రూ.2లక్షల పెట్టుబడి పెట్టి పసుపు పండిస్తే ధర రూ.8వేల నుంచి రూ.11 వేలలోపే ఉందని, గతేడాది రూ.16వేలు పలికిందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినా మద్దతు ధర లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.4వేల బోనస్ ప్రకటించాలని కోరారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే కనీసం రూ.20వేల మద్దతు ధర ఇవ్వాలని కోరారు. రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు డబ్బా రమేశ్‌రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, తురక శ్రీధర్‌రెడ్డి, బందేలా మల్లయ్య, కొమ్ముల సంతోష్‌రెడ్డి, కాటిపెల్లి ఆదిరెడ్డి, మామిడి రాజశేఖర్‌రెడ్డి, కాటిపెల్లి ఆదిరెడ్డి, కాసారపు భూమారెడ్డి, కల్లెం మహిపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment