● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్వామివారం బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి 21 వరకు నిర్వహించనున్న విషయం తెల్సిందే. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి కల్యాణానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షల మంది భక్తులు రానున్నట్లు ఆలయ అఽధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఆలయంలోని శేషప్ప కళావేదికపై స్వామి వారల కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే లక్షలాది మంది భక్తులకు ఆ స్థలం సరిపోవడం లే దు. దీంతో బ్రాహ్మణ సంఘం పక్కనున్న యాగశాల స్థలంలో ఈ సారి కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సదరు స్థలాన్ని గురువారం అధికారులు, వేదపండితులతో కలిసి అడ్లూరి పరిశీలించారు. భక్తులకు సరిపడా టాయిలెట్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, నీడ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. కల్యాణం నిర్వహించే స్థలంచుట్టూ కంచె వేయాలన్నారు. అంతకముందు విప్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచారి, శ్రీనివాసాచారి, నాయకులు దినేష్, వేముల రాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment