● బీసీల్లో అన్యమతస్తులను చేర్చొద్దు ● చక్కెర ఫ్యాక్టరీల
జగిత్యాలటౌన్: ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. ప్రభుత్వ రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. బీసీల కుల రిజర్వేష న్‌లో అన్యమతస్తులను చేర్చడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వేసిన కమిటీ కాలయాపనగా మారిందన్నారు. ఫ్యాక్టరీ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని సూచించారు. కేంద్రం మంజూరు చేసిన నవోదయ విద్యాలయం ఏర్పాటును బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు నలువాల తిరుపతి, కస్తూరి సత్యం, రెంటం జగదీశ్, ఆముద రాజు, జుంబర్తి దివాకర్, చెన్నాడి మధురిమ, ఓరుగంటి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కోరుట్లలో నాయకుల ఆందోళన
కోరుట్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలంటూ కోరుట్లలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బీజే పీ రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు, నిజామాబాద్ కో–కన్వీనర్ గుంటుక సదాశివ్, పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేశ్, జిల్లా అధికార ప్రతినిధి వడ్డెపల్లి శ్రీనివాస్, ఎలేటి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment