● టీబీ ముక్త్ పంచాయతీలుగా మానాల, గొర్రెగుండం ● డిప్యూట
మల్యాల: టీబీ రహిత జిల్లా లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మానాల, గొర్రెగుండం గ్రామాలను గురువారం సందర్శించారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించారు. 102 శాతం పరీక్షలు నిర్వహించగా.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో మానాల, గొర్రెగూడెం గ్రామాలను టీబీ ముక్త్ పంచాయతీలుగా నామినేట్ చేశామని తెలిపారు. టీబీ లక్షణాలు కనపడితే.. వెంటనే పరీక్షలు చేసుకోవాలని, ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించాలని సూచించారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీ అనూష, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment