మహిళలు ఉన్నతస్థాయికి ఎదగాలి
జగిత్యాలజోన్: మహిళలు ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచించారు. జగిత్యాల కోర్టులో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపారాలు చేస్తూ పారిశ్రామిక రంగంలోకి పెద్దఎత్తున రావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి ప్రసాద్, మొదటి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు జితేందర్, వినీల్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డబ్బు లక్ష్మారెడ్డి, భూమి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
Comments
Please login to add a commentAdd a comment