బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఈనెల 10నుంచి నిర్వహించే బ్రహ్మోవాల ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. భక్తుల క్యూలైన్లు, బ్రహ్మపుష్కరిణి, బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం వద్ద కల్యాణమహోత్సవ వేదిక పనులు, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈవో శ్రీనివాస్, డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సైలు ఉదయ్‌కుమార్, ఉమాసాగర్ పాల్గొన్నారు.
విప్‌కు ఆహ్వానం
ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల కు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు దేవస్థానం తరఫున ఈవో శ్రీనివాస్ ఆహ్వాన పత్రి కను అందజేశారు. వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, నంబి శ్రీనివాసచారి, నేరెళ్ల శ్రీనివాసచారి పాల్గొన్నారు. కాగా.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన కల్యాణ మహోత్సవం శ్రీమఠం వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వేదపండితులు స్థలశుద్ధి, పుణ్య:వచనం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment