ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరించాలి
జగిత్యాల: ప్రతీ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తును క్రమబద్ధీకరించాలని, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, మండలాల వారీగా ఎన్ని ఉన్నాయో గుర్తించి, పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 31 చివరి రోజు కావడంతో ఎక్కువ దరఖాస్తులు చేపట్టాలని తెలిపారు. లే అవుట్ క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం సామాన్య ప్రజలకు భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రాయితీ సైతం ఇవ్వడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ లత, డీపీవో మధుసూదన్, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీలు చేయాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వందశాతం డెలివరీలు చేయించేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జన ఔషధ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాన్ కమ్యునికేబుల్ డిసేజెస్ ఉన్న వారిని మార్చి నెలాఖరు వరకు గుర్తించి వైద్యం అందించాలన్నారు. ఈ కార్య క్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, వైద్యులు జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment