చెప్పలేను
26
బొగ్గుగనిలో సీ్త్ర శక్తి
గోదావరిఖని(రామగుండం): సింగరేణికి సీ్త్ర శక్తి తోడైంది. ఇప్పటివరకు పురుష రంగానికే పరిమతమైన సింగరేణి మైనింగ్‌లో మహిళలు అడుగీడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో మహిళలకు సింగరేణి ఉపాధి అవకాశాలను మరింత పెంచింది. కేవలం కార్యాలయాల్లోనే కాకుండా భూగర్భ గనుల్లో పనిచేసే ఇంజినీర్లు, అండర్ మేనేజర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు చేరారు. ప్రస్తుతం సంస్థలో 201 మంది అధికారిణులుగా 1,794 మంది మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు గనులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. సంస్థలో తొలి మహిళా రెస్క్యూ బ్రిగేడియర్‌గా కొత్తగూడెం పీవీకే–5గనికి చెందిన అండర్‌మేనేజర్ అంబటి మౌనిక ఎంపికై ంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్‌అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ జీఎంగా సింగరేణి చరిత్రలోనే తొలిసారి మహిళా అధికారి కవితనాయుడు సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లీష్మెంట్– సీఎస్సార్ జీఎంగా తొలిసారి మరో మహిళా నికోలస్ బెనడిక్ట్, సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే కంపెనీ సెక్రటరీగా సునీతాదేవి, న్యాయ విభాగం బాధ్యతలను డిప్యూటీ జీఎం హోదాలో శిరీషరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ సుజాత విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment