నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు | - | Sakshi
Sakshi News home page

నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు

Published Sat, Mar 8 2025 2:12 AM | Last Updated on Sat, Mar 8 2025 2:07 AM

నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు

నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు

గోదావరినదిలో గుర్తుతెలియని శవం

ధర్మపురి: మండలంలోని రాయపట్నం వద్ద ఉన్న గోదావరినదిలో శుక్రవారం గుర్తు తె లియని వ్యక్తి శవం తేలిందని ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపారు. వయస్సు 35నుంచి 40ఏళ్లు ఉంటుందని, ప్రమాదవశాత్తు పడిపోయా డా..? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనే కోణా ల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేనిస్థితిలో ఉండగా జగిత్యాల మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

కోరుట్ల: పట్టణంలోని గాంధీరోడ్డు కాముడి పెంటవద్ద తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మైలారపు అంజయ్య తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి వారంక్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి వెళ్లాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని రెండు బీరువాల తాళాలు పగుల గొట్టి అందులోని 3తులాల బంగారం, రూ.50వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. ఘటనా స్థలాన్ని శుక్రవారం ఎస్సై రాంచంద్రం గౌడ్‌ పరిశీలించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మండలమహిళా సమాఖ్యలను ఎంపికచేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఐదు మండల మహిళా సమాఖ్యలకు అవకాశం దక్కడం గమనార్హం. శనివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమాఖ్యలకు బస్సులు కేటాయించనున్నారు.

ఎన్‌ఆర్‌ఎల్‌ఎం సాయంతో..

నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈ పథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లెవెలుగు) బస్సులు కొంటారు. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చూపిస్తారు. వీటి నిర్వహణ ఆర్టీసీ చూసుకుంటుంది. నెలనెలా రూ. 77,220 చొప్పున ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది.

ఎంపికై న సంఘాలివే..

వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో పెద్దపల్లి జిల్లాల్లో 9, రాజన్న సిరిసిల్లకు 9, కరీంనగర్‌ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీచైతన్య సమాఖ్య, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్‌ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు మంత్రుల చేతులమీదుగా కొత్త బస్సులు అందుకోనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement