మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జగిత్యాల: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి సాధికారత కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంప్‌లో మహిళాశక్తి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. 90 శాతం రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి త్వరలోనే చేస్తామని, ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామని, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.30 కోట్లు, బీటీరోడ్లకు రూ.35 కోట్లు, రోల్లవాగుకు రూ.15 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో స్వశక్తి సంఘాలు 15,150 ఉన్నాయని, వాటికి సున్నా వడ్డీ కింద బ్యాంక్ లింకేజీ రూ.20లక్షల చొప్పున ఇస్తామని వెల్లడించారు. జిల్లాలో 15 మహిళా సంఘాలకు 15 బస్సులు అందిస్తున్నామన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, మాజీ చైర్‌పర్సన్ జ్యోతి పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
సారంగాపూర్: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి విప్ క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించడం సరికాదన్నారు. అంబేడ్కర్ తన రాజ్యాంగంతోనే అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. విగ్రహాలకు నష్టం చేయాలన్న ఆలోచన ప్రజల్లో రాకుండా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల్లో భేదాభిప్రాయాలు ఉంటే పోలీసులు సహాయంతో పరిష్కరించుకోవాలిగానీ.. ఇలా విగ్రహాన్ని అవమానించడం సరికాదన్నారు. మాజీ ఎంపీపీలు ధర రమేశ్, మసర్తి రమేశ్, గుడిసె జితేందర్, మాజీ కౌన్సిలర్లు కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్, కోండ్ర రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి
జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడని, తనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సీఎంతో మాట్లాడామని, జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరామని తెలిపారు. ఈనెల పదో తేదీన ప్రకటన వస్తుందని వెల్లడించారు.
సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment