కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాలరూరల్: ఎన్నికల సమయంలో మహిళలకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలో ఇప్పుడు విఫలమైందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తిలో మహిళలతో కలిసి వేడుకలు నిర్వహించారు. బంధాలు, బాధ్యతల కోసం తల్లిగా, గృహిణిగా అన్ని రంగాల్లో మహిళలు అందించే సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. అలాంటి సీ్త్రమూర్తులందరినీ గౌరవించేలా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలపై, స్థానిక ఎమ్మెల్యేకు ఓటు వేసి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మహిళలు చెంపలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment