మహిళా సాధికారికతోనే సమాజ అభివృద్ధి
జగిత్యాలక్రైం: మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో మహిళలను సన్మానించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీస్ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువని, అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని తెలిపారు. పోలీసు శాఖలో పలు విభాగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని వివరించారు. గృహ హింస, వైవాహిక వివాదాల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, మహిళా ఎస్సైలు గీత, సుప్రియ, రిజర్వ్ సీఐలు కిరణ్ కుమార్, వేణు, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, జిల్లా పరిధిలోని వివిధ విభాగాల మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్ పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment