‘మై ఆటో సేఫ్’కు శ్రీకారం
కోరుట్ల: మహిళల భద్రతే లక్ష్యంగా మైఆటో సేఫ్ స్కానర్లు ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. కోరుట్ల జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఆటో డ్రైవర్లకు భద్రత, మైఆటో సేఫ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు సామాజికంగా అదనపు బాధ్యతలు ఉంటాయని, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోల్లో ప్రయాణించే వారి భద్రతలో భాగంగా ఆటోలకు స్టిక్కర్లు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు వేల ఆటోలు ఉండగా ఇప్పటివరకు 2093 ఆటోలకు మై ఆటో సేఫ్ స్టిక్కర్లు వేశామన్నారు. ఇందుకు సహకరించిన ఆటో యూనియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల ఆర్టీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆటోల రిజిస్ట్రేషన్‌తోపాటు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ తప్పక ఉండాలన్నారు. ఆటో యూనియన్ నాయకులు ఆరీఫ్, రఘునాఽథ్, గణేశ్ మాట్లాడుతూ కోరుట్ల లో ఆటోల్లో ప్రయాణించిన వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేష్‌బాబు, ఎంపీడివో రామకృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, రాంచంద్రం, నవీన్, శ్యాంరాజ్ పాల్గొన్నారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
ఎస్పీ అశోక్‌కుమార్
ఆటోలకు స్కాన్ స్టిక్కర్లు
Comments
Please login to add a commentAdd a comment