‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు

Published Wed, Mar 12 2025 7:54 AM | Last Updated on Wed, Mar 12 2025 7:48 AM

‘పది’

‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు

● నేడు కలెక్టర్‌తో ముఖాముఖి ● ఈనెల 15 నుంచి ఫోన్‌ఇన్‌ ● నిమిషం నిబంధన లేదు ● వసతులన్నీ ఏర్పాటుచేశాం ● అరగంట ముందు వస్తే ప్రశాంతం ● సాక్షి ఇంటర్వ్యూలో డీఈవో రాము

జగిత్యాల: ‘పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక చొ రవ తీసుకుని జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలి పేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పిల్లలకు కలెక్టర్‌ లేఖల ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలిపా రు. ఇందులో భాగంగానే ఈనెల 12న (బుధవా రం) విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విద్యార్థులు వారివారి పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటే ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చు. వేసవికాలం కావడంతో విద్యార్థులకు సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం..’ అన్నారు డీఈవో రాము. ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో డీఈవో రాముతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..

సాక్షి: జిల్లాకేంద్రంగా ఏర్పడిన మూడేళ్లు ఎస్సెస్సీ ఫలితాల్లో హ్యాట్రిక్‌ సాధించింది. తర్వాత నుంచి అట్టడుగు స్థానంలోనే ఉంటోంది. ఈసారి ప్రథమస్థానం సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?

డీఈవో: పదో తరగతి ఫలితాలపై కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రం ఏర్పడిన మూడేళ్ల పాటు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి కూడా అలాంటి ఫలితాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు?

డీఈవో: కలెక్టర్‌ సత్యప్రసాద్‌ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్‌ స్వయంగా లేఖలు పంపించారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా కష్టపడుతున్నాం. ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం.

సాక్షి : విద్యార్థుల సందేహాలను ఎలా తీర్చుతున్నారు..?

డీఈవో: ఈనెల 15నుంచి ఫోన్‌ఇన్‌ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక నిపుణుడిని నియమించాం. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఫోన్‌ ఇన్‌లో సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఫోన్‌ఇన్‌ నంబరు అందిస్తాం. ఈసారి జిల్లాలో మొత్తం 67 సెంటర్లు ఏర్పాటు చేశాం. అందులో అన్ని మౌలిక వసతులు కల్పించాం.

సాక్షి: ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు?

డీఈవో: జిల్లాలో మొత్తం 11,855 మంది పరీక్ష రాయబోతున్నారు. ఇందులో 5878 బాలురు, 5,977 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులు 285 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేషన్‌ సిబ్బంది, ఫ్లయింగ్‌స్క్వాడ్‌, పోలీసు సిబ్బందికి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.

సాక్షి: సిబ్బందిని ఎంత మందిని నియమించారు..?

డీఈవో: చీఫ్‌ సూపరింటెండెంట్లు 67, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు 67, అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు 4, ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌ 4, కస్టోడియన్స్‌ 22, ఇన్విజ్‌లేటర్లు 827 మందిని నియమించాం. విద్యార్థులు ఎండనుంచి తప్పించుకునేందుకు తాగునీటి వసతి కల్పిస్తున్నాం. ప్రతి గదిలో ఫ్యాన్‌, ఫర్నిచర్‌ ఏర్పాటు చేశాం. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ఈ సారి నిమిషం నిబంధన అమలులో లేదు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ప్రశాంతంగా విద్యార్థులు పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది.

సాక్షి: ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని పాఠశాలలు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని తెల్సింది..?

డీఈవో: అలాంటివారు మాకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. హాల్‌టికెట్‌ ఇవ్వకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. BE.TELA NGA NA.GOV.I N ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు1
1/1

‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement