జఫర్‌గఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కార్మిక, ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు కోరారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంపన్నులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు . నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదన్నారు. కార్మికులకు మేలు చేసే 49 కార్మిక చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. యాజమాన్యాలకు మేలు చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నదన్నారు. ఇందుకోసం కొత్తగా నాలుగు లెబర్ కోడ్‌లను అమలు చేసేందుకు సిద్ధ పడుతున్నట్లు తెలిపారు. మతతత్వ విధానాల ముసుగులో పూర్తిగా కార్మిక, ప్రజా వ్యతి రేక విధానాలు అనుసరిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు యాతం సమ్మ య్య, నల్లతీగల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment